మైనర్‌పై సొంత సోదరుడి లైంగిక దాడి

29 Nov, 2019 10:09 IST|Sakshi

కేసు పెట్టేందుకు కుటుంబ సభ్యుల నిరాకరణ

సాక్షి, మచిలీపట్నం: సమాజంలో రానురాను కుటుంబ విలువలు.. మానవత్వం కనుమరుగైపోతున్నాయి.. కుటుంబ జీవితానికి మాయని మచ్చగా మారిన ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. అమ్మలో సగం.. నాన్నలో సగం కలిపితే అన్న అంటారు. తల్లిదండ్రులను మరిపించే స్థాయిలో తోబుట్టువులను ప్రేమించాల్సిన సొంత అన్నే ఆ తోబుట్టువుపాలిట కామంధుడుగా మారాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి చివరకు గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కొంత కాలంగా తమ కుమార్తె ఆరోగ్యం క్షీణిస్తుండడంతో ఆమె తల్లిదండ్రులు మచిలీపట్నం ఆస్పత్రికి తీసుకొచ్చారు.

పరీక్షించిన వైద్యులు ఆ మైనర్‌ బాలిక మూడు నెలల గర్భవతి అని చెప్పడంతో కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆరా తీసేసరికి సొంత అన్నే ఈ అకృత్యానికి పాల్పడినట్టు గా తెలుసుకుని ఆ కుటుంబం ఘొల్లుమంది. కాగా ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆ కుటుంబ సభ్యులు నిరాకరించారు. విషయం తెలుసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు యత్నించగా, కేసు నమోదు చేస్తే తమ పరువుపోతుందని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. దీంతో చేసేది లేక పోలీసులు సైతం వెనుదిరిగారు. కాగా లైంగిక దాడికి పాల్పడిన యువకుడు పరారీ కాగా, ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.  ఆ నోటా ఈ నోటా ఈ వార్త నగరమంతా వ్యాప్తిచెంది అంతా ముక్కున వేలేసుకున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా