సోదరిని హత్యచేసిన అన్నదమ్ములు

13 Mar, 2020 15:41 IST|Sakshi

లక్నో : వివాహేతర సంబంధం ఓ వితంతువు ప్రాణాలను తీసింది. తోడబుట్టిన అన్నదమ్ములు సొంత సోదరిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ సమీపంలో గల న్యూమండిలోలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోకడ గ్రామానికి చెందిన సుమిత్‌ కుమార్‌, సోను అన్నదమ్ములు. వీరి సోదరి భర్త రెండేళ్ల క్రితం రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత ఆమె మరో యువకుడు జుల్‌ఫికర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం ఇంట్లో వారికి చెప్పి జుల్‌ఫికర్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుంది.

ఇదే ప్రతిపాదనను ఆమె సోదరుల ముందుంచి. కానీ దానిని ఆమె సోదరులు తీవ్రంగా ఖండించారు. జుల్‌ఫికర్‌తో సంబంధాన్ని మానుకోవాలని పలుమార్లు హెచ్చరించారు. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలోనే సోదరి తీరుపై తీవ్ర  ఆగ్రహం తెచ్చుకున్న అన్నదమ్ములు వితంతువును గొంతునులిమి చంపారు. బయటి వారికి ఎవరికీ తెలియకుండా కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆమె అంత్యక్రియలు కూడా చేశారు.  అనంతరం విషయం తెలుసుకున్న జుల్‌ఫికర్‌.. తన ప్రేయసి సోదరులపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు