స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో జ‌వాను ఆత్మ‌హ‌త్య‌

6 Jun, 2020 17:19 IST|Sakshi

 రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గడ్‌లో బిఎస్ఎఫ్ జ‌వాను స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో  కాల్చుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. కంకెర్ జిల్లాలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌ 157 బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ శ‌నివారం ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు తెలిపారు. పంక‌న్‌జోర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని అట‌వీ ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జరిగింద‌ని పేర్కొన్నారు. చ‌నిపోయిన జ‌వాన్‌ను సురేష్ కుమార్‌గా గుర్తించిన‌ట్లు తెలిపారు. అయితే ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు ఇంకా తెలియ‌లేద‌ని ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు చెప్పారు. ( వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై.. )

బార్డ‌ర్ సెక్యురిటీ ఫోర్స్ 157వ బెటిలియ‌న్ బృందం  శుక్రవారం సంగం గ్రామంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్స్ వ్య‌తిరేక ఆప‌రేష‌న్‌లోనూ  సురేష్ కుమార్ పాల్గొన్నారు. త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ శిబిరానికి  200 మీటర్ల దూరంలో ఉన్న ఘోడా ,  దోటమెటా గ్రామాల మధ్య ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. త‌న ద‌గ్గ‌ర ఉన్న స‌ర్వీస్ రివాల్వ‌ర్ ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకోవ‌డంతో అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు.  స్వ‌గ్రామం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ నుంచి తిరిగి వ‌చ్చిన సురేష్ కుమార్‌ను కొన్ని వారాల క్రితం క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అంతేకాకుండా శుక్ర‌వారం ఇదే బెటాలియ‌న్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎఎస్‌ఐ) కు క‌రోనా పాజిటివ్ అని నిర్ధార‌ణ అయ్యింది. దీంతో క‌రోనా వ‌స్తుందేమో అన్న డిప్రెష‌న్‌లో ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడా అన్న కోణంలోనూ ద‌ర్యాప్తు చేప‌డుతున్న‌ట్లు అధికారులు వివ‌రించారు. (హిమాచల్‌ ప్రదేశ్‌లో కేరళ తరహా ఘటన )


 

మరిన్ని వార్తలు