సినీ తారల ఫొటోలు మార్ఫింగ్‌ చేస్తున్న బీటెక్‌ స్టూడెంట్‌

22 Nov, 2017 16:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినిమా నటుల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న బొమ్మ రాహుల్ అనే బీటెక్ స్టూడెంట్ ను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ అమీర్‌పేట్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ హీరోయిన్ల ఫొటోలను అప్‌లోడ్ చేస్తున్నట్టుగా సీఐడీ గుర్తించి అతడిని పట్టుకుంది. కొంతకాలంగా రాహుల్ ఇలాంటి ఫొటోలను వెబ్ సైట్ లలో పెడుతున్నట్టుగా తేల్చారు. ఈ విషయంపై ఇటీవల స్పందించిన మా అసోషియేషన్ తారల ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్నారంటూ సీఐడీకి ఫిర్యాదు చేయటంతో దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల నుంచి వెబ్ సైట్లను కొందరు వ్యక్తులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన సీఐడీ చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు