ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం

1 Jul, 2018 11:28 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మినీ బస్సు లోయలో పడిన దుర్ఘటనలో 44 మందికి పైగా మృతి చెందారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పౌరీ-ఘడ్‌వాల్‌ జిల్లాలోని పిపాలి-బౌనా జాతీయ రహదారిపై నానిదాడా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు భోవన్‌ నుంచి రామ్‌నగర్‌ వెళ్తుండగా అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.ఘటన గురించి తెలియగానే హూటాహూటిన రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, మృత దేహాలను వెలికి తీశారు. 

ప్రధాని దిగ్భ్రాంతి.. ఘటనా స్థలంలో 35 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వార్తలు