ప్రయాణికుల ముసుగులో బస్సు దోపిడీలు

10 Apr, 2019 07:15 IST|Sakshi
నిందితులు జావేద్, జునైద్‌

అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు  

బెంగళూరు, విజయవాడ, చెన్నై, రూట్‌లే టార్గెట్‌

నేరేడ్‌మెట్‌: ప్రయాణికుల్లా బస్సు ఎక్కుతారు. టికెట్‌ తీసుకుంటారు. తోటి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న అనవతరం లూటీకి పాల్పడి ఎవరికీ అనుమానం రాకుండా తరువాతి స్టేజీలో దిగిపోతారు.  ప్రయాణికుల ముసుగులో ప్రైవేట్‌ లగ్జరీ బస్సులే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను మల్కాజిగిరి ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.  మంగళవారం నేరేడ్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌లో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్‌ వివరాలు వెల్లడించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం, అమ్రోహ జిల్లా, చుచిలా కలాన్‌ గ్రామానికి జావేద్‌ చౌదరి బ్యాగుల వ్యాపారం చేసేవాడు. అతను  అదే ప్రాంతానికి చెందిన కూలర్‌ మెకానిక్‌ మహ్మద్‌ జునైద్, జావేద్‌ చౌదరి బావ షాబాన్‌ఖాన్‌తో కలిసి ముఠా ఏర్పాటు చేశాడు. ముగ్గురు కలిసి గత మూడేళ్లుగా బస్సుల్లో దోపిడీలకు పాల్పడుతున్నారు. బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్‌ లగ్జరీ బస్సుల్లో టికెట్లు బుక్‌చేసుకొని ప్రయాణం చేసేవారు.. బస్సుల్లో  తోటి ప్రయాణికులు నిద్రలోకి జారుకున్న అనంతరం ఇద్దరు నిందితులు ప్రయాణికుల లగేజీని కిందకు దించుతుండగా, మూడో నిందితుడు బస్సులో ఎవరైనా గమనిస్తున్నారా.. అని పరిశీలించేవాడు.

అనంతరం ఇద్దరూ సీట్లో కూర్చొని బ్యాగ్‌లు, బ్రీప్‌కేస్‌లపై బ్లాంకెట్‌ కప్పి చిన్న టార్చిలైట్‌ వెలుతురులో వాటిని తెరిచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులను చోరీ చేసేవారు. అనంతరం బ్యాగ్‌లు, బ్రీప్‌కేస్‌లను యధాస్థానంలో పెట్టి, ఎవరికీ అనుమానం రాకుండా తరువాతి స్టేజీలో దిగిపోయేవారు.గత ఫిబ్రవరి 6న నేరేడ్‌మెట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని దీనదయాళనగర్‌కు చెందిన వెంకటరమణ, తన భార్య భాస్కర లక్ష్మితో కలిసి రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్‌ బస్సులో వచ్చాడు. ఎల్‌బీ నగర్‌లో బస్సు దిగి ఇంటికి చేరుకున్న వారు తమ బ్యాగ్‌లను పరిశీలించగా అందులో ఉన్న 15.8 తులాల బంగారు ఆభరణాలు, రూ.70వేల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించి ఫిబ్రవరి 7న నేరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి ఎస్‌ఓటీ, నేరేడ్‌మెట్‌ పోలీసుల విచారణలో విశ్వసనీయ సమాచారం మేరకు సికింద్రబాద్‌లో జావేద్‌చౌదరి అతని సహాయకుడు మహ్మద్‌ జునైద్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని అంగీకరించారు. కొన్నేళ్లుగా ఈ తరహా లూటీలకు పాల్పడుతున్నట్లు నిందితులు అంగీకరించారని ఏసీపీ తెలిపారు. వారి నుంచి 9తులాల బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్లు, మాస్టర్‌ కీని  స్వాధీనం చేసుకొని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా ఎక్కడెక్కడ దోపిడీలు చేశారనే కోణంలో విచారణ జరుపుతున్నామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.  సమావేశంలో నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహ్మస్వామి,  ఎస్‌ఓటీ  సీఐ శివకుమార్,  డీఐ రాజేందర్‌గౌడ్, ఎస్‌ఐ అవినాష్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విషాదం: లిఫ్ట్‌ వైర్ తెగి ఇద్దరి కార్మికుల మృతి

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌