వీధి కుక్క చావుకు  కారకుడైన డ్రైవర్‌ అరెస్టు 

8 Oct, 2019 05:37 IST|Sakshi

బంజారాహిల్స్‌: నిర్లక్ష్యంగా కారు నడిపి కుక్క చావుకు కారకుడైన క్యాబ్‌ డ్రైవర్‌పై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు. సోమవారం ఉదయం ఎండీ అబ్దుల్‌ నయీం (24) బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌–2లోని కేబీఆర్‌ పార్కు వైపు నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వైపునకు క్యాబ్‌ డ్రైవింగ్‌ చేసుకుంటూ వేగంగా దూసుకెళ్తున్నాడు. అదే సమయం లో కేబీఆర్‌ పార్కు ఫుట్‌పాత్‌వైపు నుంచి ఓ వీధికుక్క రోడ్డు దాటుతుండగా నయీం చూసుకోకుండా ఢీకొట్టాడు. దీంతో ఆ కుక్క అక్కడికక్కడే చనిపోయింది.

కంపాసియోనేట్‌ సొసైటీ ఫర్‌ యానిమల్స్‌ స్వచ్ఛంద సంస్థకు చెందిన వలంటీర్‌ అజయ్‌ ఈ దృశ్యాన్ని చూశాడు. నయీం కారును అనుసరించి అతన్ని పట్టుకొని జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి ఫిర్యాదు చేశాడు. కుక్క మరణానికి కారకుడైన డ్రైవర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆ సంస్థ చైర్మన్‌ ప్రవల్లిక ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నయీంపై ఐపీసీ సెక్షన్‌ 429, సెక్షన్‌ 11(1)(ఏ)(ఎల్‌), ప్రివెన్షన్‌ ఆఫ్‌ క్రూయాల్టీ యానిమల్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు