స్పీడ్‌ 'గన్‌' గురి తప్పిందా..?

31 Aug, 2019 10:20 IST|Sakshi
స్పీడ్‌ లేజర్‌గన్‌కు చిక్కిన అతివేగంగా వెళుతున్న వాహనం

ఓవర్‌స్పీడ్‌ వాహనానికి బదులు మరో వాహనానికి జరిమానా..

సాక్షి, నిజామాబాద్‌: రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమవుతున్న వాహనాల అతి వేగానికి చెక్‌ పెట్టేందుకు పోలీసుశాఖ చేపట్టిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన స్పీడ్‌ లేజర్‌గన్‌ గురి తప్పింది. గురువారం ఉదయం 11.48 గంటలకు 44వ జాతీయ రహదారిపై ఓ వాహనం ఓవర్‌ స్పీడ్‌తో వెళుతుంటే.. మెదక్‌ జిల్లా రామాయంపేట్‌ వద్ద ఈ స్పీడ్‌ లేజర్‌గన్‌తో గుర్తించిన పోలీసులు.. జరిమానాకు సంబంధించిన చలానా మాత్రం మరో వాహనానికి పంపారు. ఫోర్డ్‌ ఎకో స్పోర్ట్‌ వాహనం ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడితే.. తన వాహనం టీఎస్‌ 16 ఈఆర్‌7299కు చాలనా విధిస్తూ ఎస్‌ఎంఎస్‌ సందేశాన్ని పంపారని మాక్లూర్‌కు చెందిన అమర్‌ వాపోయారు. హైస్పీడ్‌తో వెళ్లిన వాహనం నెంబర్‌ కూడా ఇదే నెంబరుకు కాస్త దగ్గరలోనే ఉండటంతో పొరపాటున ఈ చలానా జారీ అయి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పొరపాటున జరిమానా విధించిన వాహనం ఇది

మరిన్ని వార్తలు