గంజాయితో తప్పించుకోబోయి..

9 Jul, 2019 09:27 IST|Sakshi

సాక్షి, చింతపల్లి (విశాఖపట్నం) : మండలంలోని లోతుగెడ్డ జంక్షన్‌ వద్ద సోమవారం పర్యాటకుడిని గంజాయి తరలిస్తున్న ఆటో బలంగా ఢీకొంది. ఈ సంఘటనలో పర్యాటకుడు తీవ్రంగా గాయపడగా ఆటో బోల్తాపడింది. వివరాల్లోకి వెళితే.. లోతుగెడ్డ జంక్షన్‌లో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. దీంతో ప్రధాన రహదారిలో పింఛనుదారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ఈ నేపథ్యంలో పోలీసులు భద్రత కాస్తున్నారు. ఇదే సమయంలో సోమవరం ప్రాంతం నుంచి ఆటో వేగంగా వస్తోంది.

ఇక్కడ ఉన్న పోలీసులను గమనించి ఆటో డ్రైవరు ఆందోళనకు గురై ఆటో వేగం పెంచాడు. ఇదే సమయంలో సమీపంలోని పంచవటి తోటల వద్ద విశాఖపట్నం పర్యాటకుడు శ్రీను భోజనం చేసి బయటకు వస్తుండగా వేగంగా వస్తున్న ఆటో అతడిని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఆటో బోల్తా పడగా పర్యాటకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో డ్రైవర్‌తో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు. ఆటో బోల్తా పడ్డాక వారు అక్కడ నుంచి పరారు అయ్యారు. వారికి స్వల్ప గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఆటో అడుగు భాగంలో గంజాయి ప్యాకెట్లు గుర్తించిన స్థానికులు వెంటనే పొలీసులకు సమాచారం అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం

తల్లి, కుమార్తె అదృశ్యం

నలుగురా..? ఇంకొకళ్ళను ఎక్కించుకోపోయారా?’

బ్లూవేల్‌ భూతం : చిరుతకు స్వాతంత్ర్యం..!

పద్మావతి డిగ్రీ కళాశాలలో చోరీ కలకలం

చిన్నారి కిడ్నాప్‌.. రూ.60లక్షల డిమాండ్‌

ఫేస్‌బుక్‌ పరిచయం.. పెళ్లి చేసుకుంటానని..

ఏసీబీ విచారణ : తల తిరుగుతోందంటూ సాకులు

ప్రేమ వివాహం.. భర్త హత్య భార్య అరెస్టు

దారుణం: బాలిక పాశవిక హత్య

ఐఎంఏ జ్యువెల్స్‌ అధినేత అరెస్టు 

బిహార్‌లో మూకదాడి.. ముగ్గురి మృతి 

ఛత్తీస్‌గఢ్‌లో ఓయూ విద్యార్థి అరెస్ట్‌ !

క్లాస్‌ లీడర్‌ కాలేదని..

అనుమానంతో భార్యను.. అడ్డువచ్చిన అత్తను..

వైరల్‌: ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌

విషాదం: ఎనిమిది మంది చిన్నారుల మృతి

విడాకుల కోసం.. భార్యను స్నేహితుడితో..

వైఎస్‌ జగన్‌పై దాడి కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం

అపూర్వ శుక్లాపై చార్జీ షీట్‌ దాఖలు

కన్నతల్లి కర్కశత్వం; చిన్నారి గొంతుకోసి..

హల్దీ బచావో..

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

వివాహేతర సంబంధం: భర్తకు తెలియకుండా 95 వేలు..

తనతో ప్రాణహాని; అందుకే నేనే చంపేశా!

వేటాడుతున్న నాటు తూటా

ఐదేళ్ల తర్వాత ప్రతీకారం..!

ఒంటరి మహిలళే వారి టార్గెట్‌!

ప్రియురాలి ఇంటి ఎదుట ప్రియుడి ఆత్మహత్య

ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళ మృతి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..