డివైడర్‌పైకి దూసుకెళ్లిన కారు

16 Jan, 2020 08:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగర శివారులో మితిమీరిని వేగంతో వెళుతున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. బుధవారం రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వేగంగా వస్తున్న కారు బస్‌ డిపో ఎదురుగా ఉన్న డివైర్‌పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించాగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు