శుభకార్యానికి వెళ్తూ..  అనంతలోకాలకు..

31 Mar, 2019 10:43 IST|Sakshi
అదుపుతప్పి బోల్తాపడిన కారు గాయపడిన ఝాన్సీ గాయపడిన వెంకట్రావు

మునగాల (కోదాడ): తన బంధువుల ఇంటిలో జరిగే శుభకార్యానికి వెళుతూ మార్గమధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శనివారం 65వ జాతీయ రహదారిపై మండలంలోని ఆకుపాముల శివారులో జరిగింది.  ఎస్‌ఐ దాసరి మహిపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలం హన్మాన్‌పాడు చెందిన నర్రా రాంబాబు(55) ఎలియాస్‌ రామాంజనేయులుతోపాటు నర్రా సాయి(16), హైదరాబాద్‌లోని మియాపూర్‌కు చెందిన లింగమనేని వెంకట్రావు, భార్య ఝాన్సీ స్విఫ్ట్‌ డిజైర్‌ కారులో కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగే వెంకట్రావు మనుమరాలు అన్నప్రాసనకు బయలు దేరారు.

మార్గమధ్యలో ఆకుపాముల వద్ద కారు టైర్‌ పేలిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న మోరీని ఢీకొట్టి ఫల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నర్రా రాంబాబు(55) అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన సాయిని స్థానికులు 108వాహనంలో చికిత్స నిమిత్తం కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కారు నడుపుతున్న  వెంకట్రావు, భార్య ఝాన్సీకి తీవ్ర గాయాలు కాగా, వారిని కోదాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి తెలిపారు. మృతులిద్దరూ వరుసకు తండ్రికొడుకులు అవుతారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా