కారు డ్రైవర్‌ నమ్మకద్రోహం

30 Jun, 2018 12:54 IST|Sakshi
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న సీఐ భీమానాయక్‌

మార్కాపురం: కారు డ్రైవర్‌గా ఉంటూ యజమానురాలిని నమ్మించి ఆమె డెబిట్‌ కార్డును దొంగతనం చేసి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసినట్లు సీఐ భీమానాయక్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుడి వివరాలు వెల్లడించారు. సీఐ కథనం ప్రకారం.. మార్కాపురానికి చెందిన శిరసనగండ్ల సునీత హైదరాబాద్‌లో వెంచర్స్‌ డెవలప్‌మెంట్‌ వ్యాపారం చేస్తోంది.

నెల కిందట ఆమె దగ్గరకు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలోని కంబలపురం గ్రామానికి చెందిన మేకల రాజశేఖర్‌ డ్రైవర్‌గా చేరి నమ్మకంగా ఉంటున్నాడు. పది రోజుల కిందట రాజశేఖర్‌ ఆమె డెబిట్‌ కార్డు నంబర్‌ కనుగొని సుమారు రూ.2,41,348 విలువ చేసే 4 ఫోన్లను ఫ్లిప్‌కార్టు ద్వార కొనుగోలు చేశాడు. విషయం సునీతకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ నెల 26న ఆమె సెల్‌ఫోన్‌కు మేసేజ్‌ రావడంతో ఆశ్చర్యానికి గురై మార్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ భీమానాయక్‌ సైబర్‌ క్రైమ్‌గా గుర్తించి ఐటీ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన రాజశేఖర్‌కు సునీత ఫోన్‌ చేయడంతో మార్కాపురంరాగా సమాచారం పోలీసులకు తెలియడంతో శుక్రవారం పట్టుకుని అరెస్టు చేశారు.   

మరిన్ని వార్తలు