గుర్తింపు కార్డులు చూసి ఇళ్లు అద్దెకివ్వండి

20 Apr, 2018 09:45 IST|Sakshi
పోలీసులకు సూచనలిస్తున్న డీసీపీ పద్మజారెడ్డి

శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి  

రాజేంద్రనగర్‌ పీఎస్‌ పరిధిలోకార్డన్‌సెర్చ్‌

అత్తాపూర్‌: నేరస్తులను గుర్తించేందుకు శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇందిరానగర్, బాబానగర్, హసన్‌నగర్‌ ప్రాంతాలలో పోలీసులు బుధవారం అర్ధరాత్రి కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఆరు మంది రౌడీ షీటర్లతో పాటు 12 మంది అనుమానితులను, 50 ద్విచక్ర వాహనాలు, 30 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. బైక్‌లకు, ఆటోలకు ఎలాంటి పత్రాలు లేవని డీసీపీ తెలిపారు. కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించడంతో పాటు ప్రజలను పలు విషయాలపై అప్రమత్తం చేశారు. ఎలాంటి గుర్తింపు కార్డులు లేని వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దని సూచించారు.

అనుమానితులు కనపడితే వెంటనే 100 నెంబర్‌కు సమాచారం అందించాలని, నేరం చేయడంతో పాటు నేరస్తులకు ఆశ్రయం కల్పించడం కూడా నేరమే అని డీసీపీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు భారీ ఎత్తున లభ్యమవడంతో వీటిని ఏఏ ప్రాంతాలలో కోనుగోలు చేశారు, ఎవరు వీరికి అమ్మారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్డన్‌ సెర్చ్‌లో శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డితో పాటు రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్, రాజేంద్రనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌తో పాటు 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అర్ధరాత్రి 3 గంటలకు ప్రారంభమైన కార్డన్‌ సెర్చ్‌ ఉదయం 6 గంటల వరకు కొనసాగింది. ప్రతి ఒక్కరి ఆధార్‌కార్డును తనిఖీ చేయడంతో పాటు ఇళ్లను కూడా పోలీసులు సోదాలు చేశారు.

మరిన్ని వార్తలు