అవకతవకలకు పాల్పడిన నలుగురిపై కేసు

10 May, 2018 13:35 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఐ రంజిత్‌

కట్టంగూర్‌ (నకిరేకల్‌) : భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా మండలంలోని అయిటిపాముల గ్రామంలో ఆన్‌లైన్‌ ఎంట్రీలో అవకతవకలకు పాల్పడిన నలుగురిపై  కట్టంగూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. బుధవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ రంజిత్‌ వివరాలు వెల్లడించారు. మార్చి 26, 2018న తహసీల్దార్‌ తిరందాసు వెంకటేశం ఆన్‌లైన్‌ ఎంట్రీలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ విజయ్‌ అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేయగా కొత్త విజయ్‌ ద్వారా ఆన్‌లైన్‌ పాస్‌వర్డ్‌ తెలుసుకున్న అయిటిపాముల వీఆర్‌ఏ కొండ్ర చిన యాదయ్య రసూల్‌గూడేనికి చెందిన ముక్కెర సైదులు అలియాస్‌ ప్రభుకు తెలిపాడు. దీంతో సైదులు తన తండ్రి, తాతల పేర్ల మీద ఉన్న భూమి ఆన్‌లైన్‌లో రాలేదని, ఎలాగైనా ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని అయిటిపాముల సర్పంచ్‌ భర్త పెద్ది సుక్కయ్యకు పాస్‌వర్డ్‌ చెప్పాడు.

దీంతో సైదులుకు చెందిన సెల్‌ఫోన్‌లో సైదులు తండ్రి పేరుతో పాటు మరికొందరికి చెందిన భూముల సర్వే నంబర్లు ఆన్‌లైన్‌ ఎంట్రీ చేశారు. బుధవారం ముక్కెర సైదులు, వీఆర్‌ఏ కోండ్ర చినయాదయ్యను అరెస్ట్‌ చేసి కోర్టుకు పంపారు. కాగా పెద్ది సుక్కయ్య, కొత్త విజయ్‌లు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు