రెండో వివాహం చేసుకున్న పాస్టర్‌పై కేసు

8 May, 2018 13:23 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మిర్యాలగూడ రూరల్‌, నల్గొండ : రెండో వివాహం చేసుకున్న పాస్టర్‌పై మిర్యాలగూడ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం కేసు నమోదయ్యింది. ఎస్‌ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలం పరిధిలోని ఊట్లపల్లి గ్రామంలో చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న అంజిబాబు అలియాస్‌ స్టిఫెన్‌ పది సంవత్సరాల క్రితం మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన అములమ్మను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులు జన్మించారు.

నేరేడుచర్ల మండల కేంద్రాన్ని చెందిన రజిత అనారోగ్యాని గురికావడంతో చర్చికి వచ్చి ప్రార్థనలు చేసేంది. ఆమెకు స్టిఫెన్‌ మాయమాటలు చెప్పి ప్రేమపేరుతో రెండు నెలల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన మొదటి భార్య అములమ్మ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో స్టిఫెన్‌తో పాటు రెండో వివాహానికి సహకరించిన మరో పది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.    

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు