‘నేను దేవుడిని’.. లఘుచిత్ర నిర్మాతలపై కేసు నమోదు

8 May, 2019 08:55 IST|Sakshi

బంజారాహిల్స్‌: క్రైస్తవుల మత విశ్వాసాలను కించపరిచేలా నేను దేవుడిని పేరుతో షార్ట్‌ ఫిలిం రూపొం దించిన సదరు నిర్మాణదారులపై కేసులు నమోదు చేయాల్సిందిగా క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త జెరుసాలెం మత్తయ్య  ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజా రాహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. నేను దేవుడిని లఘుచిత్ర నిర్మాతలు మత సామరస్యాన్ని దెబ్బతీసేలా చిత్రాన్ని నిర్మించారని, దళిత క్రైస్తవుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు చిత్ర నిర్మాణదారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు