ఆదిత్య బిల్డర్స్‌ అధినేతపై కేసు 

22 Jul, 2020 09:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆదిత్య బిల్డర్స్‌ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. ఆదిత్య బిల్డర్స్‌తో కలిసి తాము ఏర్పాటు చేసిన ‘శ్రీ ఆదిత్య వంశీరామ్‌ హోమ్స్‌ ఎల్‌ఎల్‌పీ జాయింట్‌ వెంచర్‌లో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా మోసపూరితంగా వ్యవహరిస్తూ అక్రమంగా విల్లాలు విక్రయిస్తుస్తున్న ఆదిత్య అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వంశీరామ్‌ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్‌ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. (నేనుబావబాధితుడిని : సుధీర్రెడ్డి)

ఈ మేరకు పోలీసులు కోటారెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే నందగిరి హిల్స్‌లో నివసించే సుబ్బారెడ్డి నార్సింగిలోని సర్వే నంబర్‌ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్‌ సంస్థతో 2014లో డెవలప్‌మెంట్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కారణంగా తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని సుబ్బారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (100 కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసులో కొత్త కోణం)

యువతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్‌
నాగోలు: ఎల్‌బీనగర్‌ పరిధిలోని ధనాపూర్‌ జనప్రియ కాలనీలో ఉన్న ఫ్యామిలీ కేర్‌ సర్వీస్‌ సెంటర్‌లో పనిచేసే యువతిని హత్య చేసి పారిపోయిన మరో ఉద్యోగిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు వివాహం అయ్యింది. అతనిపై భార్య వేధింపుల కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మూడు నెలల క్రితమే స్థానికంగా ఈ ఉద్యోగంలో చేశాడు. ఓ రోజు వెంకటేశ్వరావు మద్యం సేవించి వచ్చి యువతితో కలసి గదిలో వంటచేశాడు. యువతి ఒక్కతే ఉండటంతో ఆమెను లోబరుచుకోవాలని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. 

ఆమె ప్రతిఘటించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు తన గురించి బయట చెబుతుందోమోననే భయంతో ఆమెపై దాడి చేసి నోరు గట్టిగా మూసి చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఓ ప్రైవేట్‌ వాహనాన్ని బుక్‌ చేసుకుని పారిపోతుండగా సెంటర్‌ నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి నిందితుడిని గుర్తించి ఎల్‌బీనగర్‌ పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తాను చేసిన నిర్వాకాన్ని ఆ యువతి ఎవరితోనైనా చెబుతుందేమోననే భయంతో మద్యం మత్తులో హత్య చేసినట్లు వెంకటేశ్వరరావు అంగీకరించాడని సమాచారం. (ఎల్బీ నగర్లో యువతి దారుణ హత్య)

మరిన్ని వార్తలు