చంద్రబాబుపై కేసు నమోదు

31 May, 2020 13:18 IST|Sakshi

సాక్షి, కృష్ణా : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై నందిగామ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయన లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండు నెలల తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణమయ్యారని లాయర్‌ శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసుల నమోదు చేశారు. (చదవండి : ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి సిద్ధం: బొత్స)

కాగా, ప్రత్యేక అనుమతితో మే 25న ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలతో లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలైంది. మరోవైపు విశాఖ వెళ్తానని ఏపీ డీజీపీ అనుమతి కోరిన చంద్రబాబు.. మహానాడు ముగియగానే తిరిగి హైదరాబాద్‌కు వెళ్లడం గమనార్హం. 

మరిన్ని వార్తలు