చీరాల ఎమ్మెల్యే బలరాంపై కేసు నమోదు

29 Aug, 2019 11:26 IST|Sakshi

సాక్షి, చీరాల(ప్రకాశం) : చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిపై బుధవారం చీరాల ఒన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, మాజీ కౌన్సిలర్‌ యడం రవిశంకర్‌ను దుర్భాషలాడి, బెదిరించడంతో ఆయన వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోర్టు సూచనల మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.

 చదవండి : నా జోలికొస్తే.. నీ అంతు చూస్తా..!

ఈనెల 15న ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరుగుతున్న జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రోటోకాల్‌ విషయమై ఎమ్మెల్యేను యడం రవిశంకర్‌ ప్రశ్నించగా నన్నే ప్రశ్నిస్తావా... నేనేంటో చూపిస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో యడం రవిశంకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టు ఆదేశాలతో కరణం బలరామకృష్ణమూర్తిపై కేసు నమోదు చేసినట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు