మాజీ మంత్రి ఆది సోదరులపై కేసు నమోదు 

16 Mar, 2020 14:16 IST|Sakshi

జమ్మలమడుగు రూరల్‌: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, రామాంజనేయరెడ్డి, కుమారుడు గోవర్థన్‌రెడ్డి, మరో 80మందిపై  కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన రావు  తెలిపారు.  తమపై దాడి చేసినట్లు బాధితులు రెడ్డయ్య, రామాంజనేయులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా దేవగుడి గ్రామంలో 30 యాక్టు చట్టాన్ని ఉల్లంఘించి సమావేశాన్ని నిర్వహించారన్నారు. శనివారం అర్ధరాత్రి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 324, 307,147,148,188 సెక్షన్ల కింద  కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఆయన వివరించారు.

మరిన్ని వార్తలు