ప్రముఖ నటుడి భార్య, కొడుకుపై అత్యాచార కేసు

2 Jul, 2018 19:55 IST|Sakshi
తల్లి యోగితా బాలితో మహాక్షయ్‌ చక్రవర్తి.. ఇన్‌సెట్లో మిథున్‌ చక్రవర్తి

సాక్షి, ముంబై : బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, మాజీ ఎంపీ మిథున్‌ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్‌ చక్రవర్తిపై చీటింగ్‌, అత్యాచార కేసు నమోదైంది. మహాక్షయ్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఒక యువతి చేసిన ఫిర్యాదు మేరకు అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా రోహిణి కోర్టు ఆదేశించింది. వివరాలు.. గత మూడేళ్లుగా తనతో రిలేషన్‌లో ఉన్న మహాక్షయ్‌ పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి.. తనకు ఇష్టం లేకున్నా అబార్షన్‌ చేయించాడని ఆమె ఆరోపించింది. ​​​​​​​​ఈ విషయంలో మహాక్షయ్‌కు అతడి తల్లి యోగితా బాలి కూడా సహకరించిందని.. అందుకే ఆమె పేరును కూడా ఫిర్యాదులో చేర్చినట్లు బాధిత యువతి పేర్కొనట్లు సమాచారం.

కాగా గత నెలలో మహాక్షయ్‌తో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు స్పష్టం చేసిన ఓ హీరోయిన్‌.. జూలై 7న అతడిని వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలిపింది. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె‌.. ‘​​​​​‘మూడేళ్లుగా నేను, మహాక్షయ్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మా రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ కావడంతో ఈ విషయాన్ని చెప్పగానే వారేమీ ఆశ్చర్యపోలేదు. వారి అంగీకారంతోనే మార్చి నెలలో మహాక్షయ్‌ ఇంట్లో మా ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అందుకే ఇది లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌ అనుకోవచ్చు. అయితే మా వివాహం ఎక్కడ జరుతుందనేది ఇంకా నిర్ణయించలేదు కానీ కచ్చితంగా ముంబైలో మాత్రం జరగదు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ను ప్లాన్‌ చేస్తున్నాం’ అంటూ పేర్కొంది. ఈ నేపథ్యంలో మహాక్షయ్‌పై అత్యాచార ఆరోపణలు రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు