రవీనా టాండన్‌పై కేసు నమోదు

16 Oct, 2018 14:22 IST|Sakshi

ముజఫర్‌పూర్‌ : బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌పై బిహార్‌లో కేసు నమోదైంది. ఆమె కారణంగా తాను ట్రాఫిక్‌లో కొన్ని గంటల పాటు వేచి చూడాల్సి వచ్చిందని ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. వివరాలు... గత శుక్రవారం ముజఫర్‌పూర్‌లో ఓ హోటల్‌ ప్రారంభోత్సవానికి రవీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు జనాలు బారులు తీరడంతో ట్రాఫిక్‌ నిలిచి పోయింది. దీంతో తన సమయం వృథా అయిందని, అందుకే రవీనా, హోటల్‌ యజమానులపై ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది పేర్కొన్నారు. కాగా నవంబరు 2న ఈ కేసు విచారణకు రానుంది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా