సింగర్‌ సిప్పీ గిల్‌పై కేసు

7 Mar, 2020 18:57 IST|Sakshi
సిప్పీ గిల్‌

ఛండీఘడ్‌ : ప్రముఖ పంజాబీ సింగర్‌, యాక్టర్‌ సిప్పీ గిల్‌పై కేసు నమోదైంది. కొద్దిరోజుల క్రితం యూట్యూబ్‌లో అతడు విడుదల చేసిన ‘గూండాగర్ది’ అనే పాట హింసను ప్రొత్సహించేవిధంగా ఉందంటూ పండిత్‌ రావ్‌ అనే లెక్చరర్‌ శనివారం పోలీసులను ఆశ్రయించాడు. పాట హింసను ప్రోత్సహించేలా ఉందని, యువకులపై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మోగ ఎస్పీ.. సిప్పీ, పండిత్‌లను తన ఆఫీసుకు పిలిపించారు. అయితే సిప్పీ అక్కడికి వెళ్లకపోవటం గమనార్హం. కాగా, పంజాబ్‌లోని మోగ జిల్లా రౌలి గ్రామానికి చెందిన సిప్పీ, 2007లో తన సింగింగ్‌ కెరీర్‌ను ప్రారంభించాడు.

కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్‌ల ద్వారా బాగా పాపులర్‌ అయ్యాడు. 2014లో సి​ప్పీ పాడిన ‘10 మింట్‌’ వివాదాస్పదంగా మారింది. అయితే సింగర్లు పాడిన పాటలు వివాదాస్పదమై వారిపై కేసులు నమోదు కావటం సర్వసాధారణమైంది. గతనెలలో పాటల ద్వారా హింసను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలతో సిద్దూమూసే వాలా, మణ్‌కిరాట్‌ ఔలాఖ్‌ అనే ఇద్దరు సింగర్లపై కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు