6 లక్షల డాలర్లు లూటీ; ఎన్నారై డాక్టర్‌ అరెస్ట్‌

25 Jun, 2020 10:31 IST|Sakshi

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో చిన్న వ్యాపారాలను ఆదుకునేందుకు ఉద్ధేశించిన ప్రభుత్వ హామీ రుణాలలో దాదాపు 6,30,000 డాలర్లు మోసపూరితంగా సంపాదించినట్లు భారత సంతతికి చెందిన నేత్ర వైద్య నిపుణుడిపై కేసు నమోదయ్యింది. వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌లోని రైకు చెందిన అమీత్‌ గోయల్‌(57)పై ఇంతక ముందు కూడా 2019 నవంబర్‌లో ఆరోగ్య సంరక్షణ విషయాలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం అమిత్‌ బెయిల్‌పై ఉన్నారు. (తీరు మారని పాక్‌‌.. అమెరికా ఫైర్‌! )

తాజాగా డాక్టర్‌ అమిత్‌ గోయల్‌ను క్రిమనల్‌ నేరాలకు పాల్పడిన ఆరోపణలపై అరెస్టు చేయనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ అటార్నీ ఆడ్రీ స్ట్రాస్ గురువారం వెల్లడించారు. కోవిడ్‌-19 సంబంధిత ప్రభుత్వ-హామీ రుణాలను మోసపూరితంగా పొందినందుకు పెండింగ్‌లో ఉన్న నేరారోపణల కారణంగా జూన్ 26న అతన్ని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. యూఎస్‌ స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తున్నపేచెక్‌ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ (పీపీపీ) నిధులను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు అమిత్‌ ఒకే వ్యాపారానికి రెండు వేరు దరఖాస్తులు రూపొందించాడు. తప్పుడు పత్రాల ద్వారా ప్రభుత్వం నుంచి అక్రమంగా డబ్బులు కాజేశాడు. అయితే పీపీపీ నిబంధనల ప్రకారం ఒకరికి ఒక లోన్‌ మాత్రమే అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వ్యాపారికి తమ నెలవారీ పేరోల్‌ ఖర్చుల ఆధారంగానే వారికి ఇచ్చే గరిష్ట లోన్‌ను నిర్దేశిస్తారు.(భారత్‌లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు)

కాబట్టి తప్పుడు పత్రాలను రూపొందించి మోసానికి పాల్పడిన ఘటనలో అమిత్‌ను పోలీసులు అరెస్టు చేయనున్నారు. ‘ఇప్పటికే రోగులకు మిలియన్ల డాలర్ల భీమాదారులను మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోయల్ కరోనా కారణంగా మరో కొత్త మోసానికి పాల్పడ్డాడు’ అని స్ట్రాస్ పేర్కొన్నారు. అమిత్‌పై ఆరు కేసులు ఉన్నాయని మొత్తం 6,30,000 డాలర్ల ప్రభుత్వ సొమ్మును దోచుకున్నట్లు ఆయన తెలిపారు. (ట్రంప్‌ నిర్ణయం చైనాకు వరం’ )

మరిన్ని వార్తలు