టీడీపీ మహిళా ఎమ్మెల్సీపై కేసు

22 Mar, 2018 09:21 IST|Sakshi
టీడీపీ ఎమ్మెల్సీ శివ కుమారి( పాత చిత్రం)

కాకినాడ:  ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ నేతల అవినీతి కార్యకలాపాలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ టీడీపీ ఎమ్మెల్సీపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి 2012-2013 ఆర్ధిక సంవత్సరంలో రూ.26.3 లక్షల స్త్రీనిధి నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో పదిమందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో నిందితులపై కోటనందూరు పోలీసులు సెక్షన్ 409, 420 కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు  చేస్తున్నట్లు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా