గిట్టని వారు చేసిన పనే

14 Jun, 2019 07:38 IST|Sakshi
మృతి చెందిన గేదెల నుంచి నమూనాలు స్వీకరిస్తున్న పశువైద్యులు

సాక్షి, పెదవేగి(పశ్చిమ గోదావరి) : గేదెలను తమకు గిట్టని వారే చంపేశారని బాధిత పాడి రైతులు ముక్తకంఠంతో చెబుతున్నారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చెందిన పొట్నూరి శివబాలకృష్ణ సత్యసాయిదొర పశువుల పాకలో ఉన్న నీటి కుండీలోని నీరు తాగి చళ్లగొళ్ల సుబ్రహ్మణ్యం, పామర్తి నాగేశ్వరమ్మ, సుసాని సత్యనారాయణ, పర్వతనేని బాపినేడు, పామర్తి రాము, పొట్నూరి శివబాలకృష్ణ సత్యసాయిదొరకు చెందిన 18 గేదెలు ఈ నెల 9వ తేదీ ఆదివారం మృత్యువాత పడిన విషయం విదితమే.

ఇవి కాక చిన్న 4 చిన్నదూడలు సైతం 11వ తేదీ సోమవారం ఉదయం కొట్టుమిట్టాడుతూ మృతిచెందాయి. మృతిచెందిన గేదెలకు పశుసంవర్థకశాఖ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు, కొప్పాక మాజీ సొసైటీ అధ్యక్షుడు చళ్లగొళ్ల  భూస్వామి ఆధ్వర్యంలో పోస్ట్‌మార్టం చేశారు. అనంతరం అధికారులు మృతిచెందిన గేదెల నుంచి నమూనాలు సేకరించి, వాటిని పెదవేగి ఎస్సైకు అందించారు. ఎస్సై వాటిని విజయవాడ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించారు.   15 రోజుల్లో ఏ విధమైన కారణంతో గేదెలు దుర్మరణం చెందాయో తెలుస్తుందని అధికారులు  చెప్పారు. ఇదిలా ఉంటే ఎవరు ఈ దారుణానికి ఒడికట్టారో, ఏం జరిగి ఉంటుందోనని బాధిత రైతులతో పాటు గ్రామస్తుల్లో చర్చనీయాంశమైంది. 

కఠినంగా శిక్షించాలి
ఎంతో కష్టపడి పెంచిన గేదెలు కళ్లముందు కొట్టుమిట్టాడుతూ మృతి చెందడం తట్టుకోలేకపోయాను. ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. గిట్టని వాళ్లు చేసిన పనిలా ఉంది. మా కుండీలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు విషపూరితమైన మందును కలిపారని అనుమానంగా ఉంది. పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. దీనికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి.
– పొట్నూరి శివబాలకృష్ణ, బాధిత రైతు

ఇలా చేయడం దారుణం
చనిపోయిన 18 గేదెల్లో నాది ఒకటి ఉంది. నా కున్న 4 గేదెల్లో ఇది ఒకటి. ఈనడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఈ దారుణం జరిగింది. ఎప్పటి లాగానే గడ్డి మేసి, నీరు తాగింది. ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఎవరికీ అంతుపట్టడం లేదు. కానీ మూగజీవాలను ఇలా చేయడం దారుణం.
– సుసాని సత్యనారాయణ, పెదకడిమి పాడి రైతు 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కుమార్తె వద్దకు వెళ్లి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను