అంతర్జాతీయ చైల్డ్ పోర్నోగ్రఫీ రాకెట్ గుట్టురట్టు

22 Feb, 2018 22:00 IST|Sakshi

వాట్సాప్‌ అడ్మిన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ

మొబైల్ ఫోన్లు, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం

ఐదుగురు నిందితులపై కేసు నమోదు

సాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ చైల్డ్ పోర్నొగ్రఫీపై ఉక్కుపాదం మోపిన సీబీఐ ఓ గ్యాంగ్ ఆట కట్టించింది. అశ్లీల వీడియోలను వాట్సాప్‌ గ్రూపుల్లో పలు దేశాల కస్టమర్లకు పంపుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ ఓ ప్రకటనలో తెలిపింది. తాము అదుపులోకి తీసుకున్న నిఖిల్ వర్మ ఈ కేసులో ప్రధాన నిందితుడని, అతడే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అని సీబీఐ అధికారులు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి చిన్నారుల పోర్స్ వీడియోలు స్టోర్ చేసిన మొబైల్ ఫోన్లు, టాబ్లెట్స్, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

నిఖిల్ తన వాట్సాప్ గ్రూప్‌లో దాదాపు 100 మందిని సభ్యులుగా చేసుకుని అమెరికా, పాకిస్తాన్, చైనా, శ్రీలంక సహా మరికొన్ని దేశాలకు చిన్నారుల అశ్లీల వీడియోలు పంపుతున్నట్లుగా నిందితుడి వాట్సాప్‌ లో గుర్తించారు. ఐటీ యాక్ట్ 2000 ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఇప్పటికే ప్రధాన నిందితుడు నిఖిల్ వర్మతో పాటుగా నఫీజ్ రేజా, ఢిల్లీకి చెందిన జహిద్, ముంబైకి చెందిన సత్యేంద్ర ఓమ్ ప్రకాశ్ చౌహాన్, నోయిడాకు చెందిన ఆదర్శ్ లపై కేసులు నమోదు చేశారు. ఇదివరకే 3500 వెబ్‌సైట్లు చిన్నారుల అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తున్నాయని వాటిని బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని ఉపేక్షించేంది లేదని, ఇలాంటి వీడియోలు తీసిన, వాటిని సైట్లలో పోస్ట్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించిన విషయం తెలిసిందే.
     

మరిన్ని వార్తలు