బొగ్గు స్కామ్‌లో మధు కోడాను దోషిగా తేల్చిన కోర్టు

13 Dec, 2017 10:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోషిగా ప్రకటించింది. బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసులతో పాటుగా మరొకరిని కోర్టు బుధవారం దోషులుగా తేల్చింది. కోర్టు వీరిని రేపు (గురువారం) శిక్షలు ఖరారు చేయనుంది. కాగా కోల్‌కతాకు చెందిన సంస్థకు బొగ్గు బ్లాకుల కేటాయింపునకు సంబంధించి  కోడాతో పాటు మాజీ ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ బసు, బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో ఐదుగురిపైనా చార్జిషీట్ దాఖలు అయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు