రాయపాటిపై సీబీఐ కేసు నమోదు

31 Dec, 2019 16:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఉదయం నుంచి హైదరాబాద్‌, గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బ్యాంకు రుణాల ఎగవేత కేసుకు సంబంధించి అధికారులు తనిఖీలు చేపట్టారు. 

సోదాల అనంతరం రాయపాటిపై 120(బీ), రెడ్‌ విత్‌ 420, 406, 468, 477(ఏ), పీసీఐ యాక్ట్‌ 13(2), రెడ్‌ విత్‌ 13(1)డీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాయపాటితో పాటు ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీ ఎండీ చెరుకూరి శ్రీధర్, డైరెక్టర్‌ సూర్యదేవర శ్రీనివాస్‌లను నిందితులుగా చేర్చారు.  రుణాల ఎగవేతపై యూనియన్‌ బ్యాంక్‌ రీజినల్‌ హెడ్‌ భార్గవ్‌ ఫిర్యాదు మేరకు సీబీఐ అధికారులు ట్రాన్స్‌టాయ్‌ కార్యాలయాలతో పాటు పలు చోట్ల సోదాలు చేపట్టారు.

చదవండి : రాయపాటి ఇంటిపై సీబీఐ దాడులు

>
మరిన్ని వార్తలు