-

తండ్రికొడుకుల మృతిపై సీబీఐ కేసులు నమోదు

8 Jul, 2020 14:29 IST|Sakshi

తమిళనాడు: పోలీసుల కస్టడీలో మరణించిన  తండ్రికొడుకుల కేసులో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) బుధవారం రెండు కేసులను నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పి. జయరాజ్ అతడి కుమారుడు బెనిక్స్‌లను కోవిల్‌పట్టి పోలీసులు అరె​స్టు చేసి హింసించి చంపిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో కూడా వారు మొబైల్‌ షాపును తెరిచిఉంచడంతో అరెస్టు చేసినట్లు కేరళ పోలీసులు ఆరోపించారు. దీంతో జయరాజ్‌, బెన్నిక్స్‌ల కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. దీంతో ఈ కేసు దర్యాప్తును  సీబీఐ చేపడుతున్నట్లు కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: రాత్రంతా కొట్టారు.. లాఠీలకు రక్తపు మరకలు)

ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన మహిళ పోలీసు అధికారి తండ్రికొడుకులను జూన్‌ 19న అరెస్టు చేసి రాత్రంతా హింసించినట్లు జుడిషియల్ మేజిస్ట్రేట్ ఎంఎస్ బరతిదాసన్‌కు తెలిపారు. అంతేగాక వారిని కొట్టిన లాఠిలపై, టెబుల్‌పై రక్తం మరకలు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరారు. తమిళనాడు తూత్తుకుడి జిల్లా కోవిల్‌ పట్టి సాత్తాన్‌కులానికి చెందిన జయరాజ్‌, అతని కుమారుడు బెనిక్స్‌లు సెల్‌ఫోన్‌ షాపు నిర్వహిస్తుండేవారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌లో పరిమిత సమయానికి మించి షాపును తెరిచారనే ఆరోపణతో జూన్‌ 19న పోలీసులు అరెస్టు చేశారు. (కస్టడీలో తండ్రి కొడుకుల మృతి‌; ఆందోళనలు)

మరిన్ని వార్తలు