కోనేరు సతీష్‌బాబును విచారించిన సీబీఐ

19 Jan, 2019 04:14 IST|Sakshi
సత్యంబాబును విచారిస్తున్న సీబీఐ అధికారులు

ఆయేషా హత్య  కేసు దర్యాప్తు వేగవంతం

ఎటువంటి పరీక్షలకైనా సిద్ధమే: సతీష్‌

తల్లిని, సోదరిని చంపుతామని బెదిరించి.. బలవంతంగా నాతో నేరం ఒప్పించారు: సత్యంబాబు

రామవరప్పాడు /సాక్షి, అమరావతిబ్యూరో/నందిగామ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న  కృష్ణాజిల్లా గూడవల్లి గ్రామ మాజీ సర్పంచ్, మాజీ మంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్‌బాబును ఆయన ఇంట్లో ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ అధికారుల బృందం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు విచారించింది. పలు అంశాల్లో ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టింది. రెండు అంతస్తుల్లోని బెడ్‌రూమ్‌లు, హాల్, బీరువా, సీక్రెట్‌ లాక్‌లను ఓపెన్‌ చేసి సోదాలు నిర్వహించింది.  9 గంటల పాటు సాగిన విచారణ, సోదాల్లో పలు వస్తువులను, కంప్యూటర్‌ హర్డ్‌ డిస్క్, ఫోన్‌ లిస్టుల బుక్, సీడీ, డైరీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, ఇంట్లో పనివారి వద్ద సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని ల్యాండ్‌లైన్ల ఫోన్‌ కనెక్షన్‌ కట్‌ చేశారు. కాగా తాను నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎటువంటి పరీక్షలకైనా సిద్ధమేనని సతీష్‌బాబు అన్నారు. 

బలవంతంగా ఒప్పించారు: సత్యంబాబు
తనను బెదిరించి నేరం ఒప్పించారని ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొని జైలుకు వెళ్లి నిర్దోషిగా విడుదలయిన సత్యంబాబు పేర్కొన్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం కంచికచర్ల మండలం అనాసాగరంలోని  ఆయన ఇంట్లో సత్యంబాబును, కుటుంబ సభ్యులను విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. తాను నిర్దోషినని, అసలు ఆయేషా ఎవరో తనకు తెలియదని,  హత్య ఎలా జరిగిందో తెలియదని, కేవలం విచారణ పేరుతో రాత్రి సమయంలో వచ్చి తనను తీసుకెళ్లారని చెప్పాడు. నేరం అంగీకరించాల్సిందిగా బలవంతం చేశారని, తాను అంగీకరించకపోవడంతో తన తల్లిని, చెల్లిని చంపేస్తామంటూ బెదిరించి మరీ ఒప్పించారని తెలిపాడు. ఈ క్రమంలో తనను శారీరకంగా, మానసికంగా పోలీసులు వేధించారని, నేరం అంగీకరించకపోతే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదరించడంతో మరో గత్యంతరం లేక  నేరాన్ని అంగీకరించానని సత్యంబాబు సీబీఐ అధికారుల వద్ద వాపోయాడు.   సత్యంబాబు వాంగ్మూలాన్ని నమోదు చేసిన తరువాత ఆయేషా హత్యకు గురయిన ఇబ్రహీంపట్నంలోని లక్ష్మీదుర్గ హాస్టల్‌ను పరిశీలించారు. ఇప్పటికే ఆయేషామీరా కేసులో కీలకమైన సాక్ష్యాలు ధ్వంసం అయిన ఘటనలో ముగ్గురు విజయవాడ మహిళా కోర్టు  సిబ్బందిపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్రెండ్స్‌తో పార్టీ.. రూ. 5 వేల కోసం..

ఆస్తి వివాదం : 9 మంది మృతి

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’