నిందితులుగా బ్యాంకు అధికారులు

17 Sep, 2018 04:56 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకులకు వేలకోట్ల రూపాయల అప్పు ఎగ్గొట్టి బ్రిటన్‌కు పారిపోయిన విజయ్‌ మాల్యాపై అభియోగ పత్రాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మరో నెలలో దాఖలు చేసే అవకాశం ఉంది. మాల్యాకు చెందిన విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్‌కు రుణాలు మంజూరు చేయడంలో పాత్ర వహించిన బ్యాంకు అధికారులు, కింగ్‌ఫిషర్‌ ఉన్నతస్థాయి అధికారులను అభియోగపత్రంలో నిందితులుగా పేర్కొననున్నారని తెలుస్తోంది. కింగ్‌ఫిషర్‌కు ఆరువేల కోట్ల రూపాయల రుణాల మంజూరుకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ చార్జిషీట్‌ దాఖలు చేయనుంది. ఈ మొత్తాన్ని ఎస్‌బీఐ నేతృత్వంలో మొత్తం 17 బ్యాంకులు కలిసి మంజూరు చేశాయి.

మరిన్ని వార్తలు