కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ

1 Sep, 2019 04:22 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దుమారం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని అధికారులు తెలిపారు. మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్‌ చేసిందంటూ పలువులు రెబెల్‌ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  కర్ణాటకలోని 300 మందికి పైగా నేతల ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని ఎమ్మెల్యేలు ఆరోపించడంతో యడియూరప్ప ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ కోరింది. ఇలా ఉండగా, కర్ణాటక కాంగ్రెస్‌ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌ను ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది.  రెండోరోజు రాత్రి 8.30 గంటల తర్వాత కూడా విచారించారు.   

మరిన్ని వార్తలు