ఇంద్రాణి ముఖర్జియాను ప్రశ్నించనున్న సీబీఐ

5 Feb, 2018 20:06 IST|Sakshi
ఇంద్రాణి ముఖర్జియా(ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో మీడియా మాజీ అధిపతి ఇంద్రాణి ముఖర్జియాను సీబీఐ ప్రశ్నించనుంది. ఈ మేరకు ఇంద్రాణి ముఖర్జియాను రెండు రోజుల పాటు సీబీఐ కస్టడీకి స్పెషల్‌ జడ్జి సునీల్‌ రాణా అప్పగించారు. ఇంద్రాణి ముఖర్జియా, ఆమె భర్త పీటర్‌లు షీనా బోరా హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.  వీరిద్దరి ఆధ్వర్యంలో నడిచిన ఐఎన్‌ఎక్స్‌ మీడియా(ప్రస్తుతం 9ఎక్స్‌ మీడియా)కి విదేశీ పెట్టుబడుల ప్రొమోషన్‌ బోర్డు(ఎఫ్‌ఐపీబీ)  క్లియరెన్స్‌ కోసం 2007 సంవత్సరంలో కార్తీ చిదంబరం రూ.3.5 కోట్లు అక్రమంగా వసూలు చేశాడని, ఆ డబ్బులను తన కంపెనీలోకి అక్రమ మార్గంలో మళ్లించుకున్నాడని సీబీఐ 2017 మేలో కార్తీ చిదంబరంపై కేసు నమోదు చేసింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ఉన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను కార్తి చిదంబరం తోసిపుచ్చారు. షీనా బోరా హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జియాను 2015, ఆగస్టు 25న ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచి ఆమె జైలులోనే ఉంది. 

మరిన్ని వార్తలు