ప్రాణం తీసిన సెల్‌ఫోన్‌

23 Feb, 2020 03:05 IST|Sakshi
మధుకర్‌ (ఫైల్‌)

అవసరాల కోసం ఉపయోగపడే సెల్‌ఫోన్‌ ఇప్పుడు ఒకరి ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం సర్వాయి పంచాయతీ పరిధిలోని కొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాగే శంకరయ్య, కావిరి నారాయణ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. నారాయణ అన్న సమ్మయ్య పిల్లలైన నగేష్, మధుకర్‌.. నారాయణ ఇంట్లోనే ఉంటున్నారు. శివరాత్రి కావడంతో శుక్రవారం పాఠశాలకు సెలవు ఇవ్వగా.. నగేష్‌ సెల్‌ఫోన్‌లో మధుకర్, శంకరయ్య కుమార్తె, మరో విద్యార్థిని కలసి సినిమా పాటల వీడియోలు చూస్తున్నారు.

ఇదే క్రమంలో శంకరయ్య ఇంటికి రాగానే పిల్లలు వెళ్లిపోయారు. అయితే, తన కుమార్తె, మరో విద్యార్థిని శంకరయ్య మందలించి వదిలేశాడు. ఆ తర్వాత నారాయణ ఇంటికి వెళ్లిన శంకరయ్య.. నగేష్‌ను కర్రతో కొడుతుండగా.. అడ్డొచ్చిన మధుకర్‌ తలపై కూడా బలంగా కొట్టాడు. దీంతో అతని తల బాగా వాయగా.. వాంతులు అయ్యాయి. మధుకర్‌ను వెంటనే ఏటూరునాగారం ఆస్పత్రికి.. ఆపై వరంగల్, హైదరాబాద్‌కు తరలించారు. అంతలోగానే మెదడులో రక్తం గడ్డ కట్టడంతో మధుకర్‌ కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, నిందితుడు పరారీలో ఉన్నాడని ఏటూరునాగారం సీఐ నాగబాబు, ఎస్సై సురేష్‌ తెలిపారు.    
– ఏటూరునాగారం/కన్నాయిగూడెం 

మరిన్ని వార్తలు