రుయాలో సెల్‌ఫోన్ల దొంగోడు

30 Jan, 2019 12:22 IST|Sakshi

చిత్తూరు ,తిరుపతి క్రైం : రుయాస్పత్రిలో సెల్‌ఫోన్లను చోరీ చేస్తున్న ఓ దొంగోడిని బ్లూకోల్ట్‌  సిబ్బంది పట్టుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పేషెంట్ల గదుల్లో సెల్‌ఫోన్లు చార్జింగ్‌ పెట్టిన సమయంలో చోరీకి పాల్పడుతున్నాడని, ఇదే రోజు రెండు సెల్‌ఫోన్లు చోరీకి గురయ్యాయని రుయాలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ నాగార్జునకు సెక్యూరిటీ సిబ్బంది తెలియజేశారు. దీంతో ఆస్పత్రి పరిసరాల్లో ఓ అనుమానితుడు పోలీసులను చూసి పారిపోతుండగా వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. ఇతగాడే సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నట్టు తేలింది.  అతని నుంచి 2 సెల్‌ఫోన్లు, చార్జర్లు, ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు కాణిపాకంరోడ్డులోని తంగవేల్‌తోపునకు చెందిన పురుషోత్తం అని ప్రాథమిక విచారణలో తేలింది. నాగార్జునను ఎస్పీ అన్బురాజన్‌ రివార్డుతో అభినందించారు.

మరిన్ని వార్తలు