వృద్ధురాళ్లే టార్గెట్‌.. 

1 Sep, 2019 12:46 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ పద్మజారెడ్డి

 చైన్‌ స్నాచర్‌ అరెస్ట్‌ 

సాక్షి, అల్వాల్‌: ఒంటరిగా ఉన్న వృద్ధురాళ్లనే టార్గెట్‌ చేసుకొని  చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న గొలుసు దొంగను  అల్వాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం బాలనగర్‌ డీసీపీ పద్మజారెడ్డి వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి శృతినగర్‌కు చెందిన చేర్యాల రాజ్‌మనోహర్‌ ర్యాపిడో బైక్‌ రెంట్‌ ఆర్గనైజేషన్‌లో బైక్‌ అద్దెకు నడుపుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన సులువుగా డబ్బు సంపాదించేందుకు చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. గత నెల 26న అల్వాల్‌ పరిధిలోని వెంకటరమరణ కాలనీకి చెందిన వెంకటమ్మ అనే మహిళ రోడ్డుపై నిలబడి ఉండగా  బైక్‌పై వచ్చిన రాజ్‌మనోహర్‌ ఆమెను చిరునామా అడిగినట్లు నటించి బం గారు గొలుసు లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్‌ చేసి అతడి నుంచి 6 బంగారు నగలు, బైక్, స్మార్ట్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. గత నెల 7న మల్కాజిగిరిలోనూ చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది.  
యూ ట్యూబ్‌లో చూసి.... 
దొంగతనాలు చేయడం నిందితుడు యూ ట్యూబ్‌ ద్వారా నేర్చుకున్నట్లు డీసీపీ తెలిపారు. ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్‌ చేసుకునే ఇతను పోలీసులు, సీసీ కెమెరాలకు  బైక్‌ నంబర్‌ ప్లేట్‌ను ఓ వైపునకు వంచేవాడు. హెల్మెట్‌ ధరించడంతో ముఖం కనిపించకుండా జాగ్రత్త తీసుకునేవాడు. నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని డీసీపీ అభినందించారు. సమావేశంలో ఏసీపీ నర్సింగరావు, సీఐలు పులి యాదగిరి, రాంరెడ్డి,  వెంకట్‌రెడ్డి, డిఐ. శంకర్, ఎస్‌ఐ. నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బెయిల్‌పై వచ్చినా అదే పని..

తక్కువ కులమని వదిలేశాడు

కారు కోసమే హత్య 

భార్య కాపురానికి రాలేదని బలవన్మరణం 

ఒక దొంగ..66మంది పోలీసులు 

ఎంజీఎంలో తప్పిపోయిన బాలుడు

భార్యతో మాట్లాడుతుండగానే..

కరకట్టపై పల్టీకొట్టిన ఆర్టీసీ బస్సు

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా, నాన్నా.. నేను చేసిన నేరమేమి?

పెళ్లి పత్రికలు పంచడానికెళ్తూ..

‘ఆమె’ కోసమేనా హత్య?

అమెరికాలో కాల్పుల కలకలం

అన్నవరం దేవస్థానంలో అగ్నిప్రమాదం

ఆ ముగ్గురి మోసమే కొంపముంచింది

ఏసీబీకి చిక్కిన ‘సర్వే’ తిమింగలం

కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ

గుజరాత్‌లో అంటరానితనం

జన సైనికుడి ఘరానా మోసం

డాక్టర్‌ను పట్టుకోవటానికి రోగి వేషంలో..

సతీష్‌ హత్యకేసు: పోలీసుల అదుపులో యువతి!

భారీ పేలుడు; ఇరవై మంది మృతి!

అనుమానంతో భార్యను చంపేశాడు..

కన్నోడు.. కట్టుకున్నోడు కలిసి కడతేర్చారు

వీడు మామూలోడు కాదు..

తిరుపతిలో కిడ్నాప్‌ కలకలం

ఇంజక్షన్‌ వికటించి వైద్యుడు మృతి

వయస్సు19.. కేసులు 20

సరదా కోసం బైక్‌ల చోరీ

దూరం పెడుతోందన్న కోపంతోనే హత్యా...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సిటీతో ప్రేమలో పడిపోయాను

వీడే సరైనోడు

ఒక సినిమా.. రెండు రీమిక్స్‌లు

సింధుగా సమంత?

క్రైమ్‌ పార్ట్‌నర్‌

ముద్దంటే ఇబ్బందే!