మహిళ మెడలో గొలుసు చోరీ

4 Jan, 2019 08:59 IST|Sakshi
కర్రె మాధవి

కుషాయిగూడ: గుడికి వెళ్తున్న ఓ మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన సంఘటన గురువారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాప్రాలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాప్రా, ప్రశాంత్‌నగర్‌ కాలనీ, సాయినివాస్‌కు చెందిన కర్రె మాధవి గురువారం సమీపంలోని చాముండేశ్వరీ ఆలయాని కి నడిచి వెళుతుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఓ ఆగంతకుడు ఆమె వీపుపై కొట్టి మెడలో ఉన్న 7 తులాల  బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీనిపై సమాచారం అందడంతో మల్కాజిగిరి డీసీపీ ఉమా మహేశ్వరశర్మ, క్రైం డీసీపీ సలీమా, డిఐ భాస్కర్, ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్, డిఎస్సై విజయకృష్ణ, ఎస్సై శ్రీకాంత్‌గౌడ్‌ సంఘటన స్థలాన్ని సందర్శించారు. బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు