దొరికిన దొంగ చంద్రబాబు; సంచలనం

30 May, 2018 11:46 IST|Sakshi
ఓటుకు కోట్లు కేసు దృశ్యాలు(ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌: పట్టపగలు నేరం చేస్తూ నగ్నంగా దొరికిన దొంగ చంద్రబాబు నాయుడును చట్టపరంగా శిక్షించడంలో జాప్యం చోటుచేసుకుంటున్నది. ‘‘మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్‌ మీ..’’ అంటూ ఆయన అమలు చేసిన ఓటుకు కోట్లు కుట్ర అమలు జరిగి నేటికి సరిగ్గా మూడేళ్లు. 31మే, 2015న... తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసేందుకుగానూ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్వ‌యంగా రూ.50 ల‌క్ష‌లు ఇస్తూ పోలీసుల‌కు దొరికిపోయి, జైలుపాలయ్యారు. కొద్ది గంటల్లోనే స్టీఫెన్‌సన్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ సంభాష‌ణ‌లు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు కోట్లు కేసులో ఉమ్మడి హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న చంద్రబాబు అనంతర కాలంలో హైదరాబాద్‌పై ఉన్న 10ఏళ్ల హక్కును వదులుకుని పారిపోయే పరిస్థితి తలెత్తింది.అసలేం జరిగింది?: శాసన సభ్యుల ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఎన్నికల్లో బలం లేకపోయినప్పటికీ టీడీపీ తన అభ్యర్థిగా వేం నరేందర్‌ రెడ్డిని బరిలో నిలిపింది. అక్రమంగా ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ చీఫ్‌ చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారిగా ఓటుకు కోట్లు కుట్ర రూపొందింది. ఆంగ్లో ఇండియన్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్ స‌న్ ఇంటికి వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. రూ.50ల‌క్ష‌ల రూపాయిల నోట్ల క‌ట్ట‌ల‌ను అందించే ప్ర‌య‌త్నం చేశారు. ఆ సమయంలో రేవంత్‌ మాట్లాడిన మాటలు కూడా అత్యంత కీలకంగా మారాయి. ‘‘ఓటు వేసిన తర్వాత మిగతా డబ్బు అందజేస్తామని చెప్పి మమ్మల్ని బాస్(చంద్రబాబు) పంపించాడు. కావాలంటే మీరు మా బాస్‌తో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. ఇక్కడ తెలంగాణాలో మీకు ఎలాంటి ప్రాబ్లం వున్నా నేన్ను చూసుకుంటాను..’’ అని రేవంత్‌ చెప్పడం స్పష్టంగా వినిపిస్తాయి. అప్పటికే కుట్ర సమాచారం అందుకున్న తెలంగాణ ఏసీబీ అధికారులు.. టీడీపీ నేతల్ని రెడ్‌ హ్యాండెడ్‌గా దొరకబుచ్చుకున్నారు.

స్టీఫెన్‌సన్‌-చంద్రబాబుల సంభాషణ
స్టీఫెన్‌సన్‌ :  హలో
చంద్రబాబు మనిషి : ఆ యా బ్రదర్
స్టీఫెన్‌సన్‌ : సర్
చంద్రబాబు మనిషి : అవర్ బాబు గారు గోయింగ్ టు టాక్ టూ యు , బి ఆన్ ద లైన్
స్టీఫెన్‌సన్‌ : ఒకే సర్

చంద్రబాబు : హలో
స్టీఫెన్‌సన్‌ : సర్ గుడ్ ఈవినింగ్ సర్

చంద్రబాబు : ఆ గుడ్ ఈవినింగ్ బ్రదర్ హౌ ఆర్ యు
స్టీఫెన్‌సన్‌ : ఫైన్ సర్ థ్యాంక్ యు

చంద్రబాబు : మనవాళ్ళు అదే దే బ్రీఫ్డ్‌ మీ
స్టీఫెన్‌సన్‌ : యా సర్

చంద్రబాబు : ఐ యాం విత్ యు డోంట్ బాదర్
స్టీఫెన్‌సన్‌ : రైట్

చంద్రబాబు : ఫర్ ఎవ్రీ థింగ్ ఐ యాం విత్ యు , వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్
స్టీఫెన్‌సన్‌ : యా సర్ రైట్

చంద్రబాబు : ఫ్రీలి యు కెన్ డిసైడ్ నో ప్రాబ్లం అట్ ఆల్
స్టీఫెన్‌సన్‌ : ఎస్ సర్

చంద్రబాబు : దట్ ఈజ్ అవర్ కమిట్‌మెంట్‌ వి విల్ వర్క్ టుగెదర్‌
స్టీఫెన్‌సన్‌ :  రైట్

చంద్రబాబు : థ్యాంక్ యు
ఏపీకి ఆపాదించే కుట్ర: చంద్రబాబు సంభాషణల వీడియో బయటికి రావడం, ఓటుకు కోట్లు కేసులో ’దొరికిన దొంగ చంద్రబాబు’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడం లాంటి పరిణామాలతో బెంబేలెత్తిపోయిన చంద్రబాబు.. ఢిల్లీ వెళ్లి అక్క‌డి పెద్దల కాళ్లావేళ్లాపడి కాపాడాల్సిందిగా వేడుకున్నారు. అటుపై కోర్టును ఆశ్రయించారు. ఈలోపే తన కుట్రలకు మరింత పదునుపెట్టిన చంద్రబాబు.. హైదరాబాద్‌లో ఆంధ్రులకు రక్షణలేదని, ఉమ్మ‌డి రాజ‌ధానిలో సెక్ష‌న్ 8ని అమలుచేయాలని నాటకాలు మొదలుపెట్టారు. టీడీపీ అక్రమ వ్యవహారాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ వ్య‌వ‌హారంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా ఉండి అవినీతి వ్యవహారంలో చంద్రబాబు పట్టుబడిన వైనం సంచలనం సృష్టించింది.

మరిన్ని వార్తలు