అమలాపాల్‌పై ఛార్జీషీట్‌?

18 Jun, 2018 16:05 IST|Sakshi
అమలాపాల్‌

ప్రముఖ హీరోయిన్‌ అమలాపాల్‌పై ఛార్జీషీట్‌కు రంగం సిద్ధమైంది. నకిలీ అడ్రస్‌తో కారు రిజిస్ట్రేషన్‌.. పన్ను ఎగవేత కేసులో ఆమె చిక్కులు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో కోర్టులో లొంగిపోయిన ఆమె.. వెంటనే బెయిల్‌పై బయటికొచ్చారు. ఈ కేసులో ఇప్పుడు ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని కేరళ ప్రభుత్వం.. పోలీస్‌ శాఖను ఆదేశించినట్లు సమాచారం. 

మాతృభూమి కథనం ప్రకారం.. ఫేక్‌ అడ్రస్‌తో కోటి రూపాయల విలువ చేసే కారును పుదుచ్చేరిలో అమలాపాల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారు. దీంతో కేరళ ప్రభుత్వానికి ఆమె రూ. 20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లయ్యింది. ఈ వ్యవహారం వెలుగులోకి రావటంతో కేరళ సర్కార్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ను రంగంలోకి దించించింది. ఒక్క అమలనే కాదు.. సీనియర్‌ నటుడు సురేష్‌ గోపీ, మరో హీరో పహద్‌ ఫజిల్‌ కూడా ఇదే తరహాలో పన్ను ఎగ్గొట్టారని తేలింది. దీంతో క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు పక్కా ఆధారాలతో వారిపై కేసు నమోదు చేశారు.

అయితే కేసు కోర్టులో విచారణ కొనసాగుతుండగానే.. ప్రభుత్వం వారికి పన్నులు చెల్లించేందుకు మరో అవకాశం కల్పించింది. వారిలో ఫహద్‌ పన్ను చెల్లించటంతో అతనిపై కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, అమలా, సురేష్‌ గోపీ మాత్రం పన్ను చెల్లించేందుకు నిరాకరించటంతో ఈ కేసులో కఠినంగా వ్యవహారించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఛార్జ్‌షీట్‌ నమోదు చేయాలని క్రైమ్‌ బ్రాంచ్‌కు సూచించిందంట. అయితే సురేష్‌ గోపి రాజ్యసభ సభ్యుడు కావటంతో ఈ వ్యవహారంలో న్యాయ నిపుణులు సలహా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారని ఆ కథనం ఉటంకించింది.

మరిన్ని వార్తలు