చంద్రాపూర్‌ గ్యాంగ్‌ ‘డబ్బుల్‌’గేమ్‌!

1 Feb, 2019 01:22 IST|Sakshi
పూజలు జరిపిన మందమర్రిలోని ఇల్లు

పులి చర్మంపై డబ్బులు పెట్టి పూజ చేస్తే డబుల్‌ వస్తాయని మోసం

6 లక్షలతో ఉడాయించిన ముఠా 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: చంద్రాపూర్‌ ముఠా డబుల్‌ గేమ్‌ బయటపడింది. మంచిర్యాల జిల్లాలోని శివ్వారంలో వేటగాళ్ల ఉచ్చుకు జనవరి 8న బలైన పెద్దపులి ఘటనను ఆసరా చేసుకొని ఈ ముఠా మోసానికి ఒడిగట్టింది. టైగర్‌ హంటింగ్‌ ఎండ్‌ అసోసియేషన్‌ పేరుతో వచ్చిన చంద్రాపూర్‌ గ్యాంగ్‌ పులిచర్మాన్ని కొనుగోలు చేయడం అటుంచి, ఆ చర్మంపై డబ్బులు పెట్టి పూజ చేస్తే రెండింతలవుతాయని నమ్మించి రూ. 6 లక్షలు కాజేసి పరారైంది. గోదావరి ఖనికి చెందిన పూర్ణ, ఆసిఫాబాద్‌కు చెందిన పాండు, టీహెచ్‌ఈఏ అధ్యక్షుడిగా చెప్పుకునే నందు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. పులి చర్మం విక్రయించే నిందితులను, అటవీ అధికారుల ను మోసం చేసి డబ్బులతో పారిపోవాలని నిర్ణయించుకున్నారు. శివ్వారానికి చెందిన సాయి లు, తోకల మల్లయ్య, తోకల బుచ్చిరాజంలను పులిచర్మంతో మందమర్రికి రప్పించారు. మం దమర్రికి చెందిన అంజయ్య, కొమురయ్య, నర్సయ్య, అంజయ్య కుమారుడు సాగర్‌లతో మాట్లాడి పూజలకు ఏర్పాటు చేయించారు. ‘పులి చర్మం అమ్ముకునే బదులు దాన్ని దగ్గరుంచుకుని స్వామీజీతో పూజలు చేస్తే డబ్బులు రెట్టింపవుతాయి’ అని వారికి ఆశ చూపారు. రూ.10 లక్షలు తెచ్చుకోమని చెప్పారు. వీరం తా అప్పులు చేసి రూ.6 లక్షలు సమకూర్చుకున్నారు. నందు అండ్‌ గ్యాంగ్‌ డబుల్‌ గేమ్‌ ఆడుతూ ‘పులి చర్మాన్ని పట్టిస్తాం’ అంటూ అటవీ అధికారులతో టచ్‌లో ఉన్నారు. 

24న పూజలు.. అదేరోజు పరారీ
జనవరి 24న అంజయ్య ఇంట్లో స్వామి అవతారమెత్తిన నందు, పాండు, పూర్ణ పులిచర్మంపై రూ. 6 లక్షలు ఉంచారు. కొద్దిసేపటికి డబ్బుతో ఉడాయించారు. పారిపోతూ అంజయ్య ఇంట్లో పులిచర్మం విక్రయిస్తున్నారని అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి బాధితులను అదుపులోకి తీసుకున్నారు. తాము పులిచర్మాన్ని కొనుగోలు చేసేందుకు వచ్చినవారిగా నమ్మించి, పులిచర్మాన్ని ప్రభుత్వానికి పట్టించామని థామస్‌ మీడియా ముందు చెప్పడం గమనార్హం. నిందితులు విచారణలో చెప్పి న నిజాలతో అధికారులు అవాక్కయ్యారు. కాగా ‘టైగర్‌ హంటింగ్‌ ఎండ్‌ అసోసియేషన్‌’ పేరుతో ఓ వెబ్‌సైట్‌ నడుస్తోంది. దీనిలో ఉం చిన నంబర్‌కు ‘సాక్షి ప్రతినిధి’ ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ చేసి ఉంది. పోలీసులు వీరి కాల్‌డేటా ఆధారంగా పట్టుకునే యత్నంలో ఉన్నారు.   

>
మరిన్ని వార్తలు