నిత్యపెళ్లికొడుక్కి కటకటాలు

31 Oct, 2019 08:25 IST|Sakshi
మోసగాడు రంగప్పను అరెస్టుచూపుతున్న పోలీసులు

అనాథనని, ఆస్తులున్నాయని మోసాలు  

నలుగురు యువతులకు ప్రేమ, పేరుతో వల  

వంచకుడు రంగప్ప అరెస్టు

హిందూపురం: అమ్మాయిలకు ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి పెళ్లిళ్లు చేసుకుంటున్న గోరంట్ల మండలం బుదిలివాండ్లపల్లికి చెందిన రంగప్ప (30) అనే మోసగాన్ని అరెస్ట్‌ చేసినట్లు డీఎస్పీ  మహబూబ్‌బాష చెప్పారు. వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురంలోని ఓ యువతికి ఐదునెలల క్రితం ఒక అపరిచిత వ్యక్తి ఫోన్‌ చేసి మాటలు కలిసి తన వివరాలు తెలిపే క్రమంలో బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నానని, అనాథనని తనకు లారీలు, బస్సులున్నాయని నమ్మించాడు. ఇంకా పెళ్లికాలేదని చెప్పుకొచ్చాడు. అలా మాటలు కలిపి ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని ముగ్గులోకి దించాడు. అమ్మాయి తల్లిదండ్రులు కట్నకానుకల కింద బంగారు నగలు, భారీగా నగదును ముట్టజెప్పారు. డబ్బుదస్కం అందినవెంటనే మోసగాడు ముఖం చాటేశాడు. ఫోన్‌ కూడా ఎత్తేవాడు కాదు. 

బయటపడిన బండారం  
అనుమానం వచ్చిన యువతి తల్లిదండ్రులు విచారించగా రంగప్ప మోసగాడని తెలింది. అతనికి ఇంతకు మునుపే ముగ్గురు, నలుగురు యువతులను ఇలాగే ప్రేమ, పెళ్లిళ్లు పేరిట మోసం చేసినట్లు తెలిసిందన్నారు. బాధితురాలు, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగప్పను వన్‌టౌన్‌ పోలీసులు అరెస్టుచేసి విచారించారు. చిలమత్తూరు మండలంలోని పాతచామలపల్లిలో ఓ యువతితో పెళ్లిఅయ్యి ఇద్దరు సంతానం ఉన్నారని తెలిసింది. అలాగే బెంగళూరులో మరో యువతి నమ్మించి పెళ్లి చేసుకున్నాడు. ఇంకా రెండుచోట్ల వివాహాలపేరిట మోసం చేసినట్లు తెలిసింది. ఇతన్ని అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చుతున్నామని డీఎస్పీ తెలిపారు.  

మరిన్ని వార్తలు