ప్రేమించి.. పెళ్లాడి.. మొహం చాటేశాడు

5 Aug, 2019 09:18 IST|Sakshi
నిందితుడు కార్తీక్‌

నిందితుడిపై కేసు నమోదు  

బంజారాహిల్స్‌: ప్రేమించి పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసిన అనంతరం మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లికి చెందిన కార్తీక్‌ ఆకుదా బెంగళూరులో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పని చేసేవాడు. యూసుఫ్‌గూడ బస్తీకి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగినితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో ఇద్దరూ కలిసి కొన్నాళ్లు సహజీవనం చేశారు. అనంతరం పెళ్ళి కూడా చేసుకున్నారు. కాగా అంతకుముందే ఎనిమిదేళ్లుగా మరో యువతితోనూ సహజీవనం చేస్తున్న కార్తీక్‌ ఒకరికి తెలియకుండా మరొకరిని మోసం చేస్తూ వచ్చాడు.

తనతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోకుండా తప్పించుకు తిరుగుతూ మరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ మొదటి ప్రియురాలు జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలియడంతో అతడి భార్య అక్కడికి వెళ్లి భర్తను విడిపించింది. కాగా మొదటి ప్రియురాలు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించి జైలుకు పంపిస్తానంటూ బెదిరించడంతో కార్తీక్‌ భార్యను దూరం పెడుతుండటంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అప్పటి నుంచి అతను ముఖం చాటేశాడు. దీంతో బాధితురాలు గత నెల 31న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని, భరోసా కేంద్రానికి  పంపించారు. రెండోసారి భరోసా కేంద్రానికి హాజరుకాకపోవడంతో బంజారాహిల్స్‌ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. తన భర్త కార్తీక్‌తో పాటు అతడి తండ్రి వెంకటేశం, తమ్ముడు నాగరాజు, స్నేహితుడు మనోజ్‌లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పేరుతో టోకరా

వికారాబాద్‌లో దారుణం

అమ్మాయి గొంతు కోసి దారుణ హత్య

కొనసాగుతున్న విచారణ

కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య 

నెత్తురోడిన హైవే

ఘోర రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి

వాల్‌మార్ట్‌ స్టోర్‌లో కాల్పులు; కారణం అదే..!

తల్లీకూతుళ్లను రైల్లో నుంచి తోసి...

దారుణం : 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

వర్క్‌ ఫ్రమ్‌ హోం పేరిట మోసం..

మూకదాడిలో వ్యక్తి మృతి: 32 మంది అరెస్ట్‌

క్షణికావేశం.. భార్య ప్రాణాలు తీసింది!

సాంఘిక సంక్షేమంలో శాడిస్ట్‌ అధికారి 

పంచాయతీరాజ్‌లో మామూళ్ల పర్వం

నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య

ఐటీఐలో అగ్నిప్రమాదం 

భార్యను హత్య చేసి.. ఇంటికి తాళం వేసి..

బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం

తుపాన్‌ మింగేసింది

ఒక్కడు.. అంతులేని నేరాలు

కలెక్టర్‌పై ట్విటర్‌లో అసభ్యకర పోస్టులు

మత్తు వదిలించేస్తారు!

ఆమెతో చాటింగ్‌ చేసి అంతలోనే..

దండుపాళ్యం బ్యాచ్‌లో ఇద్దరి అరెస్టు

కాల్పుల కలకలం.. 20 మంది మృతి

ఆటోలో తిరుగుతూ దొంగతనాలు చేస్తారు

ఎంత పని చేశావు దేవుడా!

పదహారేళ్లకే నిండునూరేళ్లు.. 

కారుతో ఢీ కొట్టిన ఐఏఎస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వారం రోజులపాటు ఆశ్రమంలో

ఆ పాత్రలో తానెలా నటించినా ఆమెతో పోల్చరాదు

సౌత్‌ ఎంట్రీ?

దోస్త్‌ మేరా దోస్త్‌

చూసీ చూడంగానే...

బందోబస్త్‌కు సిద్ధం