కుమార్తెను చూసేందుకు వచ్చిన స్నేహితురాలితో..

22 May, 2019 10:15 IST|Sakshi
నిందితుడు మహ్మద్‌ షరీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: తన కుమార్తెను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ఆమె స్నేహితురాలితో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి పరారైన సంఘటన నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అన్నకు మద్దతుగా అతడి తమ్ముడు బాధితురాలి కుటుంబాన్ని చంపుతానని బెరిరించడంతో వారం రోజుల క్రితం ఫలక్‌నుమా పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే సంఘటన జరిగిన ప్రాంతం నారాయణగూడ పీఎస్‌  పరిధిలో ఉండటంతో అక్కడి పోలీసులు కేసును నారాయణగూడకు బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా, గడియాగవారం గ్రామానికి చెందిన మహ్మద్‌ షరీఫ్‌ హలీమ్‌ తయారీ కార్మికుడిగా పని చేసేవాడు. అతడి కుమార్తె కింగ్‌కోఠిలోని ఓ ఇంట్లో పని చేస్తోంది. తరచూ కుమార్తెను చూసేందుకు నగరానికి వచ్చే మహ్మద్‌ షరీఫ్‌ ఆమె స్నేహితురాలితో పరిచయం పెంచుకుని గత సెప్టెంబర్‌లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. దీంతో ఇంట్లో తెలియకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు తనను పెళ్లి చేసుకోవాలని మహ్మద్‌ షరీఫ్‌పై ఒత్తిడి చేయడంతో అన్నకు మద్దతుగా నిలిచిన అతని సోదరుడు మహ్మద్‌ చంద్‌ ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితురాలిని బెదిరించడంతో ఆమె ఫలక్‌నుమా పోలీసులను ఆశ్రయించింది. అక్కడి పోలీసులు కేసును నారాయణగూడ పీఎస్‌కు బదిలీ చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ రమేష్‌కుమార్‌ మంగళవారం నిందితులు మహ్మద్‌ షరీఫ్, మహ్మద్‌ చంద్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీబీఐ వలలో ఎక్సైజ్‌ అధికారి

సెల్ఫీ వీడియో; నాకు చావే దిక్కు..!

అమీర్‌పేటలో బాంబు కలకలం

దాచాలంటే దాగదులే!

వేర్వేరు చోట్ల ఐదుగురు ఆత్మహత్య

హత్య చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు

ప్రేమ పెళ్లి చేసుకొన్న ఆటోడ్రైవర్‌ ఆత్మహత్య!

బస్సులో మహిళ చేతివాటం! ఏకంగా కండక్టర్‌కే..

పెళ్లైన 24 గంటలకే విడాకులు

అత్తింటి ఆరళ్లు! అన్నను ఎందుకు రానిచ్చవంటూ...

ఖాకీ వేషంలో ఉన్న దొంగల అరెస్టు

నగ్నంగా ఉంటే నయమవుతుంది!

నెత్తురోడిన రహదారులు

ఆ రెండు కమిషనరేట్లలో 1000 మంది రౌడీ షీటర్లు!

తప్పతాగి.. పోలీసుపై మహిళ వీరంగం!

చివరిసారిగా సెల్ఫీ..

పెళ్లి పేరుతో మోసం నటుడి అరెస్ట్‌

సినీ నటితో అసభ్య ప్రవర్తన

మోసం.. ఆపై ఆత్మహత్యాయత్నం.!

14 ఏళ్ల బాలికను వేధించిన 74 ఏళ్ల వృద్ధ మృగాడు!

కుమార్తె వద్దకు వెళ్లి తిరిగి వస్తూ..

రాజాంలో దొంగల హల్‌చల్‌

నన్ను ప్రేమించలేదు..అందుకే చంపేశాను

ఫేస్‌బుక్‌ రిలేషన్‌; వివాహితపై అత్యాచారం

రాంప్రసాద్‌ హత్య కేసులో మరో నలుగురు రిమాండ్‌ 

ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’