భారీ మోసం : లోన్లు ఇస్తామని చెప్పి..

18 Jul, 2018 15:47 IST|Sakshi

సాక్షి, ఖమ్మం : కోఆపరేటివ్‌ సొసైటీ సంస్థ పేరుతో లోన్లు ఇస్తామని చెప్పి దాదాపు 5000మంది ఖాతాదారులను నిండా ముంచిన ఘటన ఖమ్మంలో చోటు చేసుకుంది. హాపీ ప్యూచర్‌ మల్టీ పర్పస్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ సంస్థ ప్రజల వద్ద నుంచి సెక్యూరిటీ డిపాజిట్ల పేరుతో ఒక్కో వ్యక్తి నుంచి రూ. 80,000 చొప్పున సేకరించింది. మూడున్నర లక్షల వరకు లోన్లు ఇస్తామని ఖాతాదారులకు నమ్మబలికింది. తీరా లోన్లు ఇవ్వాల్సిన టైం వచ్చేసరికి చేతులెత్తేశారు.

దీంతో బాధితులు ఖమ్మం టూ టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు  హ్యాపీ ఫ్యూచర్ కో ఆపరేటివ్ సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్ తో మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 45 బ్రాంచీలు తెరిచిన సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 5 కోట్ల మేర వసూలు చేసింది. జిల్లా వ్యాప్తంగా 600 మంది ఉద్యోగులు, సుమారు 5000 మంది ఖాతాదారులు మోసపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు