ఆగని చిరుత దాడులు

13 Mar, 2018 12:03 IST|Sakshi
చిరుత దాడిలో చనిపోయిన లేగదూడ

రామాయంపేట(మెదక్‌): చిరుతల దాడుల పరంపర కొనసాగుతుంది. గత పదిహేను రోజులుగా ప్రతిరోజూ మండలంలోని ఏదో చోట చిరుత దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనితో ఆయా గ్రామాల్లో రైతులు తీవ్ర ఆందోళన  చెందుతున్నారు. తాజాగా ఆదివారం రాత్రి చిరుతలు మండలంలోని అక్కన్నపేటలో రెండు, లక్ష్మాపూర్‌ పరిధిలో ఒక దూడను హతమార్చాయి. అక్కన్నపేటకు చెందిన వెల్ముల లక్ష్మి తన పశువులను అటవీప్రాంతానికి సమీపంలో  పంటచేలవద్ద కట్టివేయగా, అర్థరాత్రి చిరుత దాడిచేసి రెండు దూడలను హతమార్చింది.

ఉదయం లక్ష్మి తన పంటచేలవద్దకు వెళ్లి చూడగా, ఒక దూడ చనిపోయి ఉండగ, మరో దూడ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ కొద్దిసేపటి తరువాత మృతిచెందింది. మరో సంఘటనలో లక్ష్మాపూర్‌ గ్రామశివారులో చింత పోచయ్యకు చెందిన దూడను చిరుత ఎత్తుకెళ్లి హతమార్చింది. దీనితో రైతులు రాత్రి వేళలో పంట చేలవద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. చిరుతలను బంధించి తమను రక్షించాలని వారు అటవీశాఖ అ«ధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆ శాఖ అధికారులు సంఘటనా స్థలిని సందర్శించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు