మా షాపులో ముస్లింలెవరు పనిచేయడం లేదు!

10 May, 2020 11:27 IST|Sakshi

చెన్నై : ముస్లింలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఒక బేకరి యజమాని అరెస్టు చేసిన ఘటన చెన్నెలోని టీనగర్‌లో చోటుచేసుకుంది. తమ షాపులో ముస్లింలెవరు పని చేయడం లేదని, అన్ని జైన మతస్తులు తయారు చేసిన స్వీట్లే ఉన్నాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన ఒక వ్యక్తి టీనగర్‌లో జైన్‌ బేకరీస్ అండ్‌ కన్‌ఫెక్షనరీస్‌‌ పేరుతో బేకరీ షాపును నిర్వహిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో దేశంలో కేసులు పెరగడానికి తబ్లీగి జమాత్‌ సమావేశం ఒక కారణమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ సమావేశానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు హజరయ్యారు. దీంతో ముస్లింలు నిర్వహించే షాపుల నుంచి వస్తువులను కొనడానికి ప్రజలు భయపడుతున్నారు.
(మంచిర్యాల జిల్లాలో కరోనా కలకలం..)


ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న సదరు యజమాని బేకరీ షాపు బాగా నడవాలంటే తమ షాపులో ముస్లింలెవరు పని చేయడం లేదంటూ ఒక అడ్వర్టైజ్‌మెంట్‌ను తయారు చేయించి వాట్సప్‌ ద్వారా వినియోగదారులకు షేర్‌ చేశాడు. ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సదరు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై సెక్షన్‌ 153( రెచ్చగొట్టే వ్యాఖ్యలు), 153ఏ, 505( మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు), సెక్షన్‌ 295 ఏ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  ఇప్పటివరకు దేశంలో 62939 మందికి కరోనా సోకగా.. 2109 మంది మరణించారు. 19,359 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 41472 కరోనా యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.  
(దేశంలో కరోనా విలయం.. మరో 3,277)

మరిన్ని వార్తలు