చెన్నై ఐఐటీలో అశ్లీల చిత్రాల కలకలం

21 Feb, 2020 09:44 IST|Sakshi

చెన్నై ,తిరువొత్తియూరు: చెన్నై కోట్టూరుపురంలోని ఐఐటీలో అశ్లీల చిత్రాలు కలకలం సృష్టించాయి. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు అక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుతున్నారు. ఐఐటీ ప్రాంగణంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన పరిశోధన గదులు ఉన్నాయి. ఈ పరిశోధన గదుల్లోని అన్నింటిలోనూ విద్యార్థినీ, విద్యార్థులకు వేర్వేరుగా టాయ్‌లెట్‌ సౌకర్యాలున్నాయి. రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో పరిశోధన చేస్తున్న సమయంలో ఓ విద్యార్థిని అక్కడున్న టాయ్‌లెట్‌కు వెళ్లింది.

ఆ సమయంలో అక్కడ చిన్న సైజులో వెళుతురు కనబడుతుండడం చూసి దగ్గరికి వెళ్లి చూడగా దిగ్భ్రాంతి చెందింది. ఆ సమయంలో టాయ్‌లెట్‌ బయట ఉన్న నీటి కొళాయిలో సన్నటి మార్గం గుండా ఒకరు సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తున్నాడు. విద్యార్థిని కేకలు  వేయడంతో తక్కిన విద్యార్థినులు అక్కడికి చేరుకున్నారు. సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన వ్యక్తి ఎవరని చూడగా ఐఐటీలో పనిచేస్తున్న ప్రొఫసర్‌ సుభంబెనర్జి అని తెలిసింది. అతని వద్ద సెల్‌ఫోన్‌ తీసుకుని తనిఖీ చేయగా అందులో విద్యార్థినుల అసభ్య చిత్రాలు నమోదై ఉన్నాయి. ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేశారు. ఇన్‌స్పెక్టర్‌ అజిత్‌కుమార్‌ దీనిపై కేసు నమోదు చేసి ప్రొఫసర్‌ సుభం బెనర్జిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సుభం బెనర్జి కొన్ని నెలలుగా వీడియో తీస్తున్నట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు