ఎవరీ రాకేష్‌ రెడ్డి..?

4 Feb, 2019 15:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితుడిగా ఉన్న రాకేష్‌ రెడ్డి నేరచరిత్రపై పోలీసులు దృష్టి సారించారు. గతంలో అతడిపై పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. గతంలో ఓ టాప్‌ హీరోయిన్‌తో వ్యభిచారం చేయించిన కేసులో అతడు పట్టుబడినట్టు గుర్తించారు. యువతులతో హైటెక్‌ వ్యభిచార ముఠా నడిపినట్టు అతడిపై ఆరోపణలు ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం కూకట్‌పల్లి ఎమ్మెల్యే పేరుతో బెదిరించి ఓ వ్యక్తి 80 లక్షలు వసూలు చేసిన కేసులో రాకేష్‌ అరెస్టైనట్టు తెలిసింది. ఓ రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉన్న అతడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మందికి టిక్కెట్లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి.

మాయామాటలతో మోసాలు పాల్పడటం అతడి నైజమని వెల్లడైంది. అనేక మోసాలు, దందాలు సాగించినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. జూబ్లీహిల్స్‌లోని ఓ విలాసవంతమైన ఇంట్లో అతడు అద్దెకు ఉంటున్నాడు. ఈ ఇంట్లోనే జయరాంను నిర్బంధించినట్టు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సోమవారం రాకేష్‌ నివాసం ఉంటున్న ఇంట్లో సోదాలు జరిపారు. అయితే రాకేష్‌ విలాసవంతమైన జీవితం​ చూసే శిఖా చౌదరి అతడి మాయలో పడినట్టు తెలుస్తోంది.  జయరాంకు రాకేష్‌ రెడ్డి రూ. 4.5 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి అప్పుగా ఇచ్చాడనేది తెలియాల్సివుంది. జయరాంను రాకేష్‌ హత్య చేశాడా, లేదా అనేది వెల్లడి కాలేదు. దర్యాప్తు దాదాపు ముగిసిందని, నిందితులను త్వరలోనే మీడియా ముందు ప్రవేశపెడతామని కృష్ణా జిల్లా డీఎస్పీ బోస్‌ తెలిపారు. (మిస్టరీ వీడినట్లే.. నా?)

మరిన్ని వార్తలు