ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

19 Jul, 2019 08:10 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో బాలనటుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదాన్ని నింపింది. ఛత్తీస్‌గడ్‌ రాయ్‌పూర్ వద్ద   జరిగిన ఈ ప్రమాదంలో అనేక హిందీ టీవీ సీరియళ్లలో నటించిన  శివలేఖ్ సింగ్ ‌(14)  దుర్మరణం పాలయ్యారు.  గురువారం సాయంత్రం ఈ  విషాదం చోటు చేసుకుంది.

రాయ్‌పూర్ పోలీసు సూపరింటెండెంట్ ఆరిఫ్ షేక్ అందించిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా,  అతని తల్లి లేఖ్నా సింగ్‌, తండ్రి శివేంద్రసింగ్‌ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. అయితే తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కారులో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం తరువాత పారిపోయిన ట్రక్ డ్రైవర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

చత్తీస్‌గడ్‌లోని జంజ్‌గిర్-చంపా జిల్లాకు చెందిన శివలేఖ్ సింగ్  తల్లిదండ్రులతో ముంబైలో నివసిస్తున్నారు. ‘సంకట్‌ మోచన్‌ హనుమాన్‌’, ‘ససురాల్‌ సియర్‌ కా’ లాంటి సీరియల్స్‌తోపాటు అనేక టీవీ రియాల్టీ షోలలో  శివలేఖ్‌ కనిపించారు. 


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు